కారు చీకట్లో కాంతి కిరణం
బహుజనులకు విద్య అందుబాటులో లేని సమయంలో విద్య కోసం పోరాడిన మహనీయులు, కారు చీకట్లో కాంతి కిరణం నారాయణగురు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలులోని బి క్యాంపు నందలి ఐక్య వేదిక జిల్లా ఆఫీసులో శుక్రవారం సామాజిక సంఘ సంస్కర్త నారాయణగురు 96వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారన్నారు.