స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం
‘ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం ఆదోని మండలంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం చిన్న పెండేకల్, బైచిగిరి గ్రామాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికీ వెళ్లి పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన మూడో నెలల్లోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించి పేదల ఆకలిని తీర్చిందని పేర్కొన్నారు. సంక్షోభంలోను సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.