వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
వాల్మీకి బోయలకు ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు అర్జున్ అన్నారు. సోమవారం కౌతాళంలో వాల్మీకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. రాజకీయ నేతలు వాల్మీకుల ఓట్లతో గద్దెనెక్కి వారినే అణగదొక్కుతున్నారే తప్పా రాజ్యాధికారానికి రానివ్వడం లేదన్నారు.