పాలకొండ డీఎస్పీని కలిసిన రైతు సంఘం నేతలు
పాలకొండ డీఎస్పీ రాంబాబుని ఏపీ రైతు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పప్పర పనస మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీని బుధవారం శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, గ్రంథాలయ విశ్రాంత ఆచార్యులు కనపాక చౌదరి నాయుడు, కిమిడి రామ్మూర్తి నాయుడు, వైకుంఠ రావు, చిన్నం నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.