మార్కాపురం: రెవిన్యూ సదస్సులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై ప్రజలు, రైతులు ఇచ్చిన అర్జీలను వారు స్వీకరించారు. ప్రజలు, రైతులు తెలిపిన సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.