పాలకొండ: విద్యార్థులకు బహుమతుల అందజేత
పాలకొండలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం చివరి రోజు ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్, ఇన్ఛార్జి ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క విద్యార్థి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇటీవల గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గణేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.