పాతపట్నం: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేస్తా
ప్రజా సమస్యల కోసమే ప్రజా దర్బార్ అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండల తాహశీల్దార్ కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమాన్ని బుధవారం ఆయన నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి ప్రజలకు తక్షణమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.