240 లీటర్ల అక్రమ నాటు సారా స్వాధీనం
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం తూటుపురం ఒడిశా గ్రామం నుంచి అక్రమంగా నాటుసారాను ఆంధ్రాకి తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ ఎం. విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం సీఐ మాట్లాడుతూ కవిటి మండలం జాడపూడి గ్రామానికి టాటా ఏసీ వాహనంలో 240 లీటర్ల నాటు సారాను తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.