కిడ్నీ వ్యాధితో యువకుడు మృతి
శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధితో యువకుడు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.