పాతపట్నం: అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి
అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎ. పి. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి. గోవిందరావు కి యల్ యన్ పేట మండలం రావిచంద్రి జంక్షన్ వద్ద యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుదిష్ణ, సుభాషిణి, నిర్మల లక్ష్మీ , రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.