
నగిరి: చెస్ పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులు
చిత్తూరు జిల్లా, నగరి మండలంలోని ముడిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చెస్ పోటీలల్లో ప్రతిభ చాటారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన అండర్ –17 బాలికల విభాగంలో ఎం. నవ్యశ్రీ 2వ బహుమతి సాధించింది. అండర్-11 బాలికల విభాగంలో ఎస్. దీప 5వ బహుమతి, అండర్ –9 బాలుర విభాగంలో ఎస్. తిరుమల 4వ బహుమతిని సాధించారు. దీనితో మంగళవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు బహుమతులను అందజేశారు.