చీపురుపల్లి: విచారణ అధికారిగా కే. విజయానంద్
గుర్ల మండలంలో ఇటీవల డయేరియా వ్యాప్తి చెంది అనేకమంది డయేరియా వ్యాధికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్ల ఘటనకు సంబంధించి ప్రత్యేక విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కే. విజయానంద్ ను ప్రభుత్వం నియమించింది. కాగా ఈయన మంగళవారం జిల్లాకు రానున్నారు. అనంతరం ఆయన గుర్ల మండలంలో పర్యటించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.