బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న కొండవాగులో గల్లంతయి మృతి చెందిన.. మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గోధుమలంక గ్రామానికి చెందిన బాలిక హిందుజ కుటుంబీకులను బుధవారం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం అందించి ధైర్యాన్ని చెప్పారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించిందని అన్నారు.