యలమంచిలి
పరిశ్రమలలో కార్మికులకు రక్షణ కల్పించాలి
పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత కోసం సీపీఎం చేపట్టిన రక్షణ యాత్ర అచ్యుతాపురంలో శుక్రవారం ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ప్రమాదాల్లో కార్మికులు చనిపోతే కోటి రూపాయలు ఇచ్చి కార్మికుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. యాజమాన్యాలకు ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయన్నారు.