జల జీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
జీవనానికి అవసరమైన త్రాగునీరు సరఫరాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. "జల జీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి" పథకంలో భాగంగా శుక్రవారం భీమడోలు గ్రామంలో దిగులపాడీ దిబ్బ హౌసింగ్ కాలనీ నందు జల జీవన్ మిషన్ నిధులు ₹. 56. 22 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.