కూరెళ్ళగూడెంలో తప్పిన ప్రమాదం
భీమడోలు మండలంలోని కురెళ్ళగూడెం గ్రామంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. చెరువులకు విద్యుత్ స్తంభాలు తీసుకెళ్ళే క్రమంలో ఏలూరు కాలువపై ఉన్న ఇరుకు వంతెన మీద లారీపైకి ఎక్కుతూ అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. అయితే స్తంభాలు పక్కకు జారకపోవడంతో పాటు ఆ సమయంలో పక్కనే ఉన్న బస్టాండ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తెప్పింది. అయితే భారీ వాహనాలు ఈ చిన్నపాటి వంతెనపై వెళ్లడం ప్రమాదమని స్థానికులు చెబుతున్నారు.