
ఆర్మూర్: సైలెన్సర్లు మారుస్తే కేసులు, లైసెన్స్ రద్దు
ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సైలెన్సర్లను మార్చి సౌండ్ పొల్యూషన్ చేస్తున్న ఏడు బైకులను సీజ్ చేసినట్లు ఆర్మూర్ పట్టణ సీఐ సత్య నారాయణ తెలిపారు. టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద సోమవారం కేసు నమోదు చేశామన్నారు. ఇక మీదట ఆర్మూర్ పరిధిలో ఇష్టమొచ్చినట్లుగా సైలెన్సర్లుగా మార్చేస్తామంటే కుదరదు! పెద్ద ఎత్తున శబ్ధం వచ్చేలా సైలెన్సర్లు మార్చడం, సౌండ్ తో జనాలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.