

సత్తుపల్లి
వేంసూరు: సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ దే
ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ దేనని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. వేంసూరు మండలంలోని ఎర్రగుంటపాడులో రూ. 94లక్షల ఎస్టీ ప్లాన్ నిధులతో చేపట్టే పనులతో పాటు చిన్న మల్లెల పరిధి నాయకులగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసరి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.