పాలేరు
గిరిజనులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి
తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలను ప్రభుత్వంతో పాటు దాతలు కూడా వారిని ఆదుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇటీవల వచ్చిన వరదలకు రాకాసి తండా ప్రజలు కట్టుబట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. సాయం చేసే దాతలు తమకు తోచినట్లుగా దుప్పట్లు, వంట సామాన్లు, నిత్యావసర వస్తువులు, బట్టలు ఇవ్వాలని కోరారు.