జడ్చర్ల: పోగొట్టుకున్న ఫోన్లు అందజేత
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో 2023 నుంచి 2024 సంవత్సరం వరకు దాదాపు 220 ఫోన్లు పోయినట్లు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎస్ఐ తిరుపాజీ తెలిపారు. ఇప్పటి వరకు 129 ఫోన్లను రికవరీ చేశామని, మంగళవారం ముగ్గురు బాధితులకు తమ ఫోన్ లను అందజేశామని ఎస్ఐ తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.