దేవరకద్ర: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తాం
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం ద్వారక నగర్లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అన్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.