ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తొక్కేస్తున్న బీజేపీ నేత ఎవరు?
బీజేపీ తరపున హైదరాబాద్‌లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు ఇప్పుడు సొంత పార్టీలోనే అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన ఫాలోవర్స్ వాపోతున్నారు. తాజాగా బీజేపీ మూసీ బాధితులకు అండగా ఉండేందుకు బస్తీ నిద్ర ప్రోగ్రాం కార్యాచరణను మొదలుపెట్టింది. అయితే ఇందులో పాల్గొనేందుకు రాజాసింగ్ పేరును బీజేపీ చేర్చకపోవడం గమనార్హం. బీజేపీలో కీలక నేత, ఢిల్లీ స్థాయికి చేరిన ఓ నాయకుడికి రాజాసింగ్ అంటే నచ్చకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.