మంచిర్యాల
శ్రీరాంపూర్: జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 కాలనీకి చెందిన పెనుగొండ సంపత్ (45) ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సంతోష్ సోమవారం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆటో డ్రైవర్ జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు భార్య రజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నామన్నారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.