మంచిర్యాల
మంచిర్యాల: హాస్టళ్లకు నాసిరకం సరుకులు సరఫరా
మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల హాస్టళ్లకు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాణ్యత లేని పదార్ధాలతో కూడిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.