హుస్నాబాద్: బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా బాలలందరికి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి, అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని, బాలలు తల్లిదండ్రుల కలల ప్రతి రూపాలని, భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పాలని ఆకాంక్షించారు.