హుస్నాబాద్: అయ్యప్ప దేవాలయంలో నేటి నుండి దీక్ష పరులకు నిత్యాన్నప్రసాదం
హుస్నాబాద్ పట్టణంలోని సిద్దేశుని గుట్టపై ఉన్న అయ్యప్ప దేవాలయములో సోమవారం అయ్యప్ప మాలదారులకు అన్నప్రసాదం (బిక్ష) ప్రారంభించినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి 1వ తేదీ జనవరి 2025 వరకు మాలదారులకు అన్నప్రసాదం (బిక్ష)లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పచిమట్ల రవీందర్ గౌడ్, సుద్దాల చంద్రయ్య, ఆలయ కమిటీ సభ్యులు, దీక్షపరులు పాల్గొన్నారు.