హైడ్రా పేరుతో 5లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్
అమీన్ పూర్ మండలం బీరంగూడలో ఓ వ్యక్తి వద్ద హైడ్రా పేరుతో ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ రామును పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బీరంగూడ లోని జయలక్ష్మి నగర్ లో రవి రెండో అంతస్తులో నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తున్నారని 5 లక్షలు ఇవ్వాలని రవిని రాము డిమాండ్ చేశారు. రామును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.