Dec 03, 2024, 02:12 IST/బోథ్
బోథ్
ఇచ్చోడ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
Dec 03, 2024, 02:12 IST
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చోడలో మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని జున్ని గ్రామానికి చెందిన దొంగ్రి జ్ఞానేశ్వర్ కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటలకు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.