జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జి ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ లో జరిగిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీలు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.