బాన్సువాడ సబ్ కలెక్టర్ జుక్కల్ మండల కేంద్రంలోఆకస్మిక తనిఖీలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి జుక్కల్ మండలంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూర్బా పాఠశాల, బీసీ, ఎస్సీ వసతి గృహాలను తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి రోగులను వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.