జడ్చర్ల: చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వెలుగోమ్ముల గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊర్కొండపేట శ్రీ శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల (జాతర) పోస్టర్ ను విడుదల చేశారు.