డిప్యూటీ సీఎం పదవికి ఒకే చెప్పిన మహారాష్ట్ర మాజీ సీఎం!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు మాజీ సీఎం ఏకనాథ్ షిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. ఫడ్నవీస్‌తో కలిసి ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునేందుకు శిందే అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.