ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం జవహర్ నగర్లో పర్యటించారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని గుర్తించారు. అలాగే అంబేద్కర్ నగర్లో ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా ఆక్రమణకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఫామ్ హౌస్ కు అనుమతులు జారీ చేసిన అధికారులపై, చెరువు అక్రమణలపై అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోనున్నట్టు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.