దుబ్బాక: రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చీకొడ్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న సోప్పరి భావన ఈ నెల 4న సిద్దిపేటలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్జిఎఫ్ అథ్లెటిక్స్ అండర్-17 బాలికల డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని సోమవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు భానుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.