నల్గొండలో సీపీఎం నేత మృతి
నల్గొండలోని చైతన్య నగర్ సీపీఎం మాజీ శాఖ కార్యదర్శి చింతల శోభన్ మంగళవారం మరణించారు. ఆయన మృతి బాధకరమని పట్టణ సీపీఎం కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు. శోభన్ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. సీపీఎం శాఖ ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.