పరిగి
560 మందికి 10 మరుగు దొడ్లే
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కి చెర్ల గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో 560 మంది విద్యార్థులు, 40మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 600మందికి కేవలం 10 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో రెండింటిని మిగతా సిబ్బంది వినియోగిస్తున్నారు. వున్నవి అపరిశుభ్రంగా మారడంతో పాఠశాల పరిసరాలు కంపు కొడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే అదనపు మరుగు దొడ్లు నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.