గుర్రపుడెక్క పీతల రక్తం లీటర్ ధర రూ.12.58 లక్షలు
గుర్రపుడెక్క పీత (హార్స్ షూ క్రాబ్) రక్తానికి ప్రపంచంలోనే అత్యధిక ధర ఉంటుంది. ప్రత్యేకమైన ఈ పీత రక్తం ధర లీటరుకు రూ.12.58 లక్షలు పలుకుతుంది. అందుకు కారణం.. అతి సూక్ష్మమైన మలినాలు, బ్యాక్టీరియాకు సైతం స్పందించి గడ్డ కట్టే అరుదైన స్వభావం వీటి రక్తానికి ఉండటమే. వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రత్యామ్నాయం ఇప్పటికీ అందుబాటులో లేకపోవడంతో ఈ రక్తానికి అంత ధర ఉంది. ఈ పీత రక్తం నీలం రంగులో ఉండటం మరో ప్రత్యేకం.