తిరుమలగిరి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, మోత్కూర్, అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాలకు సంబంధించిన తహసిల్దార్లు మరియు సూర్యాపేట ఆర్డిఓ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.