మోత్కూర్: మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం కవిత, మున్సిపల్ కమిషనర్ సి. శ్రీకాంత్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ నెల11వ తేదీన కస్తూర్బా పాఠశాల వద్ద గల స్థలములో కబడ్డీ, వాలీబాల్ షటిల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తికర యువకులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.