తుంగతుర్తి: కరివిరాలలో ఘనంగా శ్రీరామ మాలాధారణ కార్యక్రమం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలోనీ రామాలయంలో శుక్రవారం ఘనంగా శ్రీరామ మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి ఆమంచి అనంతరామ శర్మ కరివిరాల గ్రామానికి చెందిన మాలధారణ స్వాములకు మాలలు వేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వాస్తు వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ మాలాధారణ 23 రోజులు ఎంతో నిష్టగా మాలాధారణ స్వాములు పూజలు చేస్తారని పేర్కొన్నారు.