సీఎం సహాయ నిధికి ఏయూ ఉద్యోగులు భారీ విరాళం
ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.79,95,116 లు విరాళం అందించారు. ఏయూ వీసీ జి.శశిభూషణ రావు, రిజిస్ట్రార్ ఇ.ఎన్ ధనుంజయ రావులు శుక్రవారం విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్ధం ఏయూ బోధన, బోధనేతర ఉద్యోగులు, పెన్షనర్లు స్వచ్ఛందంగా విరాళాలు అందించినట్లు వీసీ తెలిపారు. వరద బాధితులకు తమవంతు సహాయాన్ని అందించడానికి ఏయు నిధులు సమకూరస్తుందని చెప్పారు.