4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో రద్దుచేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు సోమవారం పరవాడ ఎన్టీపీసీ మెయిన్ గేట్ వద్ద భారత కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపుమేరకు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నేడు బ్లాక్ డే పాటిస్తున్నట్లు తెలిపారు.