కళ్యాణదుర్గం: సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్పెంటర్, ప్లంబింగ్, విద్యుత్ సేవలు, వాషింగ్ మిషన్, గీజర్, వాటర్ ప్యూరిఫైయర్ లాంటి వృత్తుల్లో శిక్షణ ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్స్ ఈనెల 10వ తేది ఉదయం 10గంటలకు మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలన్నారు.