పుత్తూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
తిరుపతి జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఈ సందర్భంగా గేట్ పుత్తురు పరిసర ప్రాంతంలోని ఇళ్లలో సీఐ సురేంద్ర నాయుడు, పుత్తూరు ఎస్సై ఓబయ్య, వడమాల పేట ఎస్ఐ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు, లైసెన్స్, రికార్డుల్లేని సుమారుగా 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.