నగిరి: ఆత్మీయ సదస్సును విజయవంతం చేయండి
ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని నగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో శనివారం ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా నవంబర్ 14న ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి కేంద్రంగా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సుకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని తెలిపారు.