నగిరి: ఉధృతంగా ప్రవహిస్తున్న కుశస్థలి నది
తుఫాను ప్రభావంతో గడచిన మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా నగరి పట్టణం లోని కుశస్థలి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో మంగళవారం నగిరి నుంచి తిరుత్తణికి వెళ్లే వాహనాల దారిని కీళ్లపట్టు బ్రిడ్జి మీదుగా మళ్లించారు. అదేవిధంగా ఆ మార్గంలో వెళ్లే వాహనాలను మరో దారిలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.