అమలాపురం: వెంకన్న ఆలయంలో ఏర్పాట్లును పరిశీలించిన సీఐ
అమలాపురం వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను అమలాపురం పట్టణ సీఐ వీరబాబు గురువారం పరిశీలించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న, ఈవో ఎర్ర వెంకటేశ్వరరావుతో కలిసి దేవస్థానంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని సీఐ వీరబాబు సూచించారు. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.