అమలాపురం: ఎస్సీల్లో ఐక్యతను విచ్చిన్నం చేసేందుకే వర్గీకరణ
ఎస్సీ కులాల్లోని ఐక్యతను విచ్చిన్నం చేసేందుకే రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తెచ్చి కుట్రలు చేస్తున్నాయని మాజీ ఐఆర్ఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి ధ్వజమెత్తారు. అమలాపురంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయా రాజకీయ పార్టీ నేతలు వారి ప్రయోజనాల కోసం ఎస్సీలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ వలన ప్రభావలను అందరికీ వివరించాలన్నారు.