అమలాపురం: హాస్టళ్ల పునరుద్ధరణ కోరుతూ కేంద్ర మంత్రికి వినతి
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేందర్ కుమార్ని ఎంపీ హరీశ్ మాధుర్ గురువారం కలిశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని వివరించి శిథిలావస్థకు చేరిన హాస్టళ్ల పునరుద్ధరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందించారని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.