అల్లవరం మండలంలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో దొంగతనాలు, నేరాల నిరోధానికి పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మండల పరిధిలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మండలంలోని దేవగుప్తం, డి. రావులపాలెం, బెండమూర్లంక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎస్ఐ హరీష్ శుక్రవారం తెలిపారు. గుడ్డివాని చింత, అల్లవరం సెంటర్, కోడూరుపాడు తదితర సెంటర్లలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు కార్యాచరణ చేపట్టారు.